గణేష్ ఉత్సవాలపై భీంగల్ పోలీసుల ప్రత్యేక సమావేశం

Date: 09-09-2026
Time : 8:37 PM
Category:

భీంగల్: రాబోయే శ్రీ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా భీంగల్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

సెప్టెంబర్ 10న ఉదయం 10 గంటలకు భీంగల్ పట్టణంలోని సహస్ర ఫంక్షన్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి ఆర్మూర్ ఏసీపీ, భీంగల్ సీఐ, భీంగల్ ఎస్‌ఐ హాజరై గణేష్ ఉత్సవాల నిర్వహణ, శాంతిభద్రతలు, ఊరేగింపు, DJ వినియోగం, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జనం తదితర అంశాలపై నిర్వాహకులకు అవసరమైన సూచనలు, మార్గదర్శకాలు ఇవ్వనున్నారు.

Related Posts

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ సూచించిన నిబంధనలు, భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.

Date: 09-06-2026
Time : 8:40 PM
Category:
No more posts to show